జర్నలిస్ట్స్ హౌసింగ్ కాలనీలో టిటిడి ఆలయం విజయనగరం. ప్రభుత్వ మెడికల్ కళాశాల పక్కన జర్నలిస్స్ట్ హౌసింగ్ కాలనీలో టిటిడి నిధులతో నిర్మాణం కానున్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ కర్రోతు రాధామణి శంకుస్థాపన పూజలు జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో శ్రీశ్రీశ్రీ విజయ వర సిద్ధి వెంకటేశ్వరస్వామి వారి ఆలయం జర్నలిస్ట్స్ కాలనీలో నిర్మాణం కావటం అదృష్టమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అన్నారు. బోరు బావిని జిల్లా పరిషత్ ఛైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు, కాలువని ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ మంజూరు చేశారని, మరిన్ని ఇళ్ల నిర్మాణాలు జరిగిన తరువాత పలు మౌళిక వసతులు కల్పిస్తామని కోలగట్ల హామీ ఇచ్చారు. మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్ రాధామణి, లోక్ సత్తా రాష్ర్ట అధ్యక్షులు భీశెట్టి బాబ్జి, పలువురు వైసిపి, టిడిపి నాయకులు జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత సీనియర్ జర్నలిస్ట్ కళ్యాణ్ రామ్ దంపతులు శంకుస్థాపన అర్చన జరిపారు. అతిధులను అధ్యక్షులు బూరాడ శ్రీనివాసరావు కృతజ్ఙతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణంకి కోలగట్ల వీరభద్రస్వామి లక్ష రూపాయిలు, సీనియర్ జర్నలిస్టులు బూరాడ శ్రీనివాసరావు యాభై వేల రూపాయిలు, ఆర్.సి.ఎం. చౌదరి పాతిక వేల రూపాయిలు, బి.రామకృష్ణ ఇరవై వేల రూపాయిలు, మజ్జి వాసు పది వేల రూపాయిలు, కళ్యాణరామ్ పది వేల రూపాయిలు, దేవ త్రినాధ్‌ ఐదు వేల రూపాయిలు ఆర్ధిక సహకారం ప్రకటించారు. అతిధులను బూ.శ్రీ, మజ్జి వాసు, భళ్లమూడి నాగేంద్రప్రసాద్ , కె.శేఖర్, రమేష్ నాయుడు, ఎం.ఎం.ఎల్ .నాయుడు, మహాపాత్రో, సి.ఎన్.బాబు, బి.రామకృష్ణ, ఆర్.సి.ఎం.చౌదరి, మానాపురం రవిచంద్రశేఖర్, కె.జె.ఆర్ శర్మ, జి.వి.ఎస్.ఆర్ మూర్తి, కాళ్ల శ్రీనివాసరావు, జె.శ్రీనివాసరావు, చందక దుర్గాప్రసాద్, జోగారావు, దాలిరాజు, గౌరీశంకర్, లింగాల నరసింగరావు, అప్పారావు, రాజేంద్రప్రసాద్ (బాబా), ఆదినారాయణ, బుజ్జిబాబు, బంగారునాయుడు, దేవ త్రినాధ్ , కామేష్ , చందక మధు, వెంకటరావు, శాంతమూర్తి, భాస్కర్, శివాజి, మజ్జి శివ, గురుప్రసాద్ తదితరులు సత్కరించారు.
Sports

కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ అనిల్ కుమార్ కి కలెక్టర్ అభినందనలు

కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ అనిల్ కుమార్ కి కలెక్టర్ అభినందనలు మరిన్ని విజయాలు అందుకోవాలని శుభాకాంక్షలు విజయనగరం, డిసెంబర్ 19 :- ఇటీవల న్యూజిలాండ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచి నాలుగు బంగారు పథకాలు సాధించిన బోధంకి అనిల్ కుమార్ ను జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అభినందించారు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరిన్ని అందుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. అనిల్ కుమార్ నవంబరు నుంచి డిసెంబర్ వరకు న్యూజిలాండ్ లో జరిగిన క్రీడల్లో […]

మహిళల అండర్ -19 క్రికెట్ జట్టును అభినందించిన జిల్లా కలెక్టర్ డా .ఎ . మల్లికార్జున.

ఫెన్సింగ్ క్రీడాకారులు ఉన్నత శిఖరాలకి చేరుకోవాలి

ఆఖరి మ్యాచ్‌లో భారత్ అదగొట్టింది …ఇషాన్ కిషన్ డబుల్ , విరాట్ కొహ్లీ సెంచరీ